Crime : విషాదంగా మిగిలిన చిన్నారుల అదృశ్యం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామంలో చిన్నారులు కనిపించకుండా పోయిన కథ విషాదంగా ముగిసింది. ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన 9 ఏళ్ల ముసేటి విష్ణువర్ధన్ 12 ఏళ్ల మనుబోటి నవ శ్రావణ్ లు నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉంటారనే అనుమానంతో డ్రోన్ కెమెరాలు, పోలీసు జాగిలాలతో పోలీస్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని చెరువు కుంటలో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ప్రాంతమంతా చిన్నారుల తల్లిదండ్రులు బంధువుల ఆర్తనాధాలతో మిన్నంటి పోయింది. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కలువాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com