స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా.. 2.75 లక్షల ఫోన్ నంబర్లు బ్లాక్ చేసిన ట్రాయ్

స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా.. 2.75 లక్షల ఫోన్ నంబర్లు బ్లాక్ చేసిన ట్రాయ్

అవాంఛిత ఫోన్ కాల్స్ విషయంలో ఆన్ రిజిస్టర్ టెలీ మార్కెటర్లపై ట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 2.75 లక్షల మొబైల్ నంబర్లను టెలికం కంపెనీలు బ్లాక్ చేశాయి. మరో 50 సంస్థలనూ నిషేదిత జాబితాలో చేర్చాయి. అన్ రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్లపై చర్యలు తీసుకోవాలని ట్రాయ్ ఆదేశాలలో టెలికం కంపెనీలు ఈ చర్య తీసుకున్నాయి. దీనిపై ట్రాయ్ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.

దేశంలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువైందని ట్రాయ్ పేర్కొంది. 2020 ఏడాది తొలి ఆరు నెలల కాలంలో అన్ రిజిస్టర్డ్ టెలి మార్కెటర్లపై 7.9 లక్షల ఫిర్యాదులు వచ్చాయని ట్రాయ్ తెలిపింది. దీనికి అడ్డుకట్ల వేసేందుకు ఆయా కాల్స్ తక్షణమే నిలిపివేయాలని టెలికం కంపెనీలకు ఆగస్టు 13న ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా 2.75 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేయడంతో పాటు, 50 సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు తెలిపింది.

రిజిస్టర్ కాని టెలిమార్కెటర్లు టెలికం వనరులను దుర్వినియోగం చేస్తే తీవ్ర పరివణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Tags

Next Story