హన్మకొండ జిల్లాలో లారీ, కారు ఢీ.. నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు

హన్మకొండ జిల్లాలో లారీ, కారు ఢీ.. నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్ సమీపంలోని హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్ సమీపంలోని హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొనడంతో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు 16 నుంచి 72 ఏళ్ల మధ్య వయస్కులని తెలుస్తోంది. కారులో ఉన్న మరో ముగ్గురికి గాయాలు కాగా వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు కుటుంబాలకు చెందిన బాధితులు ఏటూరునాగారంకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story