Odisha Border : గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

Odisha Border : గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
X

ఒడిస్సా సరిహద్దుల్లో గంజాయిని సాగుచేసి నగరానికి తీసువచ్చి విక్రయిస్తున్న ముఠాను ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు ..వారి వద్ద నుంచి 6 కేజీల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సిరి మెట్ల గ్రామానికి చెందిన మాధవరావు, రాకేష్ అనే ఇద్దరు యువకులు ఒడిస్సా సమీపంలోని సొంత గ్రామంలో గంజాయి సాగుచేసి అమ్మేందుకు నగరానికి తీసుకు వచ్చారు. విశ్వస నీయ సమాచారం మేరకు అమీర్పేట్ నేచర్క్యూర్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి గంజాయి,బైక్ స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని సభ్యులు పరార్ అయ్యారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags

Next Story