Kidney Transplant Case : కిడ్నీ మార్పిడి కేసులో ఇద్దరు అరెస్ట్

కిడ్నీ మార్పిడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేశారు. అలకనంద ఆస్పత్రి యజమాని డాక్టర్ సుమంత్‌తో పాటు మరొకరిని అరెస్టు చేశారు. అలకనంద ఆస్పత్రిలో లో గత ఆరు నెలలుగా అక్రమంగా కిడ్నీమార్పిడి ఆపరేషన్స్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ నేతృత్వంలో ముఠా ఏర్పాడి… ఎలాంటి అనుమతులు లేకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన కిడ్నీ పేషెంట్లకు అలకానంద ఆసుపత్రిలో ట్రాన్స్ ప్లాంటేషన్ జరుగుతున్నట్లు పోలీసుల ప్రథమిక విచారణలో తేలింది. ఒక్కో కిడ్నీ మార్పిడికి ఆస్పత్రి యాజమాన్యం 55 లక్షల వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమాయకులైన యువతులను తీసుకొచ్చి వారి కిడ్నాలను తీసి వేరే వారికి విక్రయిస్తున్నారు. తర్వాత అమ్మాయిలను వదిలేస్తున్నారు. ఇలా నలుగురు బాధితల యువతులకు పోలీసులు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు చెందిన ప్రధాన నిందితుడైన డాక్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com