Google Maps : గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవింగ్.. రెండు కార్లకు యాక్సిడెంట్

Google Maps : గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవింగ్.. రెండు కార్లకు యాక్సిడెంట్
X

గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవింగ్ చేయడంతో రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికి తీవ్రగా యాలయ్యాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని పెద్ద చెరువు కట్ట సమీపంలో జరిగింది. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజి నీర్ పనిచేస్తున్న బెంగాల్ కు చెందిన మహిమే మండల్, తాగర్ ఖాటున్ కారులో గోవాకు వెళ్తున్నారు. మక్తల్ చెరువు కట్ట వద్ద నారాయణ అనే వ్యక్తి మరో కారులో ఎదురుగా వస్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story