కర్నాటకలో ఘోర అగ్ని ప్రమాదం .. మంటల్లో చిక్కుకుని మహిళ సజీవ దహనం..!

కర్నాటకలో ఘోర అగ్ని ప్రమాదం .. మంటల్లో చిక్కుకుని మహిళ సజీవ దహనం..!
కర్నాటకలోని ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దేవరచిక్కనహళ్ళిలోని ఆశ్రిత అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి.

కర్నాటకలోని ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దేవరచిక్కనహళ్ళిలోని ఆశ్రిత అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. గ్యాస్‌ లీక్‌ అవ్వడంతో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఊపిరి ఆడక ఇద్దరు మృతి చెందగా... మరో మహిళ సజీవ దహనమైంది. మూడు ఫైర్‌ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. మంటలు తీవ్రంగా ఎగసిపడటంతో పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌కు వ్యాపించింది. ఈ ప్రమాదం బోగూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్‌ సహా అధికారులంతా సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story