Hyderabad : మద్యం మత్తులో వీరంగం చేసిన ఆ ఇద్దరు యువకుల బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..!

Hyderabad :  మద్యం మత్తులో వీరంగం చేసిన ఆ ఇద్దరు యువకుల బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..!
X
Hyderabad : హైదరాబాద్‌లోని కొండాపూర్‌ రాఘవేంద్రకాలనీలో.. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Hyderabad : హైదరాబాద్‌లోని కొండాపూర్‌ రాఘవేంద్రకాలనీలో.. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న సాయంత్రం కొండాపూర్‌ రాఘవేంద్రకాలనీలో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

అమెరికాలో ఇంజనీరింగ్‌ చదివి ఇటీవలే నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేయడమే కాకుండా.. పోలీసుల పై కూడా యువకులు చిందులు వేయడం పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక నిందితులు నిహాల్‌, లోహిత్‌లకు డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు చేయగా.... కారు నడుపుతున్న నిహాల్‌కు 234 ఎంజీ, లోహిత్‌కు 501ఎంజీ వచ్చింది. మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 337 ర్యాష్‌ డ్రైవింగ్‌, పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు 353, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేసినందుకు 34, 185 ఎంబీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇక కారుపై ఎంపీ స్టిక్కర్ ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. అయితే.. ప్రమాదం తర్వాత కారును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ కారుపై ఉన్న స్టిక్కర్ మాయమైంది. మొదట స్టిక్కర్ పై ఎంక్వైరీ చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Tags

Next Story