Yanam: యానాంలో దారుణం.. ఇంటి ముందే వ్యక్తి హత్య..

Yanam: యానాంలోని గోపాల్ నగర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఇంటికివచ్చి మోక వేంకటేశ్వర రావు అనే వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఎదురెదురుగా కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా ఎదురుగా ఉన్న వేంకటేశ్వర రావుపై విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. ఏకదాటిగా పొడిచి అక్కడినుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మోకా వెంటటేశ్వర రావును ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.
పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నగదు వ్యవహారానికి సంబంధించి దాడిజరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆస్పత్రికి చేరుకొని పోలీసులద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి బంధువులను పరామర్శించారు. దీని వెనుక ఎవరున్నా పట్టుకొని చట్టప్రకాశం శిక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అయితే పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు.
కాజులూరు గ్రామానికిచెందిన ఓ పైనాన్స్ వ్యాపారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలే ఓ వ్యక్తి ఇంటిముందే కర్కశంగా కత్తులతో హత్యకు పాల్పడటంతో యానాంలో తీవ్రకలకలం రేపింది. దీంతో గోపాల్ నగర్‌లోని మోకా వారి వీధిలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే యానాంలో పట్టపగలే హత్యజరుగడంపై ఒకింత ఆందోళన చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com