Mastan Sai Case : మస్తాన్‌సాయి కేసులో ఏపీ అధికారి వీడియోలు

మస్తాన్ సాయి, శేఖర్ బాషా ప్రైవేట్ వీడియోల కేసులో ఓ ఏపీ అధికారి లీలలు బయటికొచ్చాయి. అడిషనల్ ఎస్పీ స్థాయిలో పనిచేసిన ఆయన ఓ యువతితో ఉన్న ఫొటోలు, చాటింగ్ దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ కేసు విషయంలో వారిమధ్య ఏర్పడిన పరిచయం వీడియో కాల్స్ వరకు వెళ్లినట్లు సమాచారం. తర్వాత ఆయన మోసం చేశాడంటూ ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో యువతికి సాయం చేసిన శేఖర్ బాషా ఆ వీడియోలను తీసుకున్నట్లు తెలుస్తోంది.
న్యూడ్ ఫొటోలతో బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి కేసులో ఇప్పటివరకు పలువురి వీడియోలు , ఆడియో రికార్డింగ్‌లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల మన్నేపల్లి లావణ్య తనపై హత్యాయత్నం చేశాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఫిబ్రవరి 3వ తేదీన గుంటూరుకు చెందిన మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటివరకు కేవలం యువతుల ఫొటోలు, ఆడియో కాల్స్ మాత్రమే అనుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com