Vishakhapatnam : సృజన ఇష్టంతోనే పెళ్లి ఫిక్స్ చేశాం : సోదరుడు విజయ్

X
By - TV5 Digital Team |13 May 2022 3:45 PM IST
Vishakhapatnam : విశాఖలో పెళ్లి పీటలమీదనే ప్రాణాలొదిలిన నవవధువు సృజన మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది.
Vishakhapatnam : విశాఖలో పెళ్లి పీటలమీదనే ప్రాణాలొదిలిన నవవధువు సృజన మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం ఆమె మృతదేహాన్ని వారి బంధువులకు వైద్యులు అప్పగించారు. సృజన పెళ్లిపీటలపై అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందిన షాక్ నుంచి బంధువులు తేరుకోలేకపోతున్నారు. ఆమె మృతికి కారణాలు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లోనే వెల్లడవుతాయని బంధువులు చెబుతున్నారు. అటు సృజన ఆత్మహత్య చేసుకుందనే వార్తలను ఆమె సోదరుడు విజయ్ ఖండించారు.. సృజన ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి ఫిక్స్ అయిందని తెలిపాడు.. పెళ్లిలో డేట్ (రుతుక్రమం) సమస్య రాకూడదనే సృజన కొన్ని మాత్రలు వేసుకోవడం వలన రెండు రోజులు పాటు కాస్త ఇబ్బంది పడిందని తెలిపాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com