నలుగురు భార్యలు.. ఐదుగురు పిల్లలు.. నిత్యపెళ్లికొడుకు 'హెడ్‌కానిస్టేబుల్ అప్పలరాజు'.. !

విశాఖలో ఓ హెడ్ కానిస్టేబుల్ నిత్యపెళ్లికొడుకుగా మారాడు. ఏకంగా నలుగుర్ని మోసం చేసి మరో మహిళను ముంచేసేందుకు సిద్ధపడ్డాడు. ఆఖరు నిమిషంలో ఆ మహిళ ఈ చీటర్ పాపాల్ని గుర్తించి నిలదీయడంతో ఈ నిత్యపెళ్లికొడుకు వ్యవహారం బట్టబయలైంది. సీసీఆర్‌బీలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అప్పలరాజుకు నలుగురు భార్యలన్నారు. ఐదుగురు పిల్లలున్నారు. ఓ మహిళకు 4 అబార్షన్లు చేయించినట్టు కూడా బాధిత మహిళ చెప్తోంది.
ఇప్పుడు మహిళా కానిస్టేబుల్‌తో వివాహానికి సిద్ధమైన అప్పలరాజును కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై నిలదీసినందుకు అతను తీవ్రంగా బెదిరించాడంటూ ఆమె తనకు మద్దతు కోసం మహిళా సంఘాల్ని ఆశ్రయించింది. తనకు అబార్షన్లు చేయించడం, ఒకరికి తెలియకుండా మరొకర్ని పెళ్లాడడంపై.. దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానిస్టేబులే నలుగుర్ని పెళ్లాడిన ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com