ఆరుగురిని హత్యచేసిన అప్పలరాజులో పశ్చాత్తాపం మచ్చుకైనా లేదు.. ఉరి తీయాల్సిందేనంటున్న విజయ్ బంధువులు

పగతో.. ఉన్మాదంతో.. ఒకే కుటుంబంలో ఆరుగుర్ని హత్య చేసిన అప్పలరాజులో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. పొత్తిళ్లలో బిడ్డను కూడా బలి తీసుకున్న తీరు చూస్తే అతను ఎంత క్రూరంగా ఈ దారుణానికి తెగబడ్డాడో అర్థం చేసుకోవచ్చు. విశాఖ సమీపంలోని పెందుర్తి మండలం జుత్తాడలో మారణకాండ నిందితుడు అప్పలరాజును నిన్నంతా విచారించారు పోలీసులు.
ఇవాళ అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. అటు, బంధువుల ఆందోళన కారణంగా నిన్న మృతదేహాల్ని పోస్ట్‌మార్టానికి తరలించేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చివరికి సాయంత్రం తర్వాత డెడ్‌బాడీల్ని KGHకు తరలించారు. ఇవాళ పంచనామా పూర్తి చేస్తారు.
విజయవాడలో ఉండిపోయిన కారణంగా ప్రాణాలతో బయటపడ్డ విజయ్.. ఈ హత్యాకాండతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. నిందితుడు అప్పలరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు. అటు అప్పలరాజును ఇవాళ పోలీసులు మీడియా ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com