Visakhapatnam Crime: బంగార్రాజు హత్య కేసులో నిందితులు వీరే.. అసలు ఎందుకు చంపారంటే..

Visakhapatnam Crime: బంగార్రాజు హత్య కేసులో నిందితులు వీరే.. అసలు ఎందుకు చంపారంటే..

ప్రతీకాత్మక చిత్రం

Visakhapatnam Crime: విశాఖపట్నంలో కలకలం రేపిన బంగార్రాజు హత్యకేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Visakhapatnam Crime: విశాఖపట్నంలో కలకలం రేపిన విద్యుత్‌శాఖ లైన్‌మెన్‌ బంగార్రాజు హత్యకేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు గలకారణాలను డీసీపీ గౌతమి సాలి మీడియాకు వివరించారు. బంగార్రాజు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని వెల్లడించారు. కోరాడ గోవింద్‌, బంగార్రాజుమధ్య జరిగిన ఆర్ధిక పరమైన వివాదంతో ఈ హత్య జరిగనట్లు పేర్కొన్నారు.

డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. తనకు రాజకీయ నాయకులు తెలుసని, విద్యుత్‌ శాఖలో షిఫ్ట్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని కోరాడ గోవింద్‌ చెప్పడంతో .. అతన్ని నమ్మిన బంగార్రాజు నిరుద్యోగుల నుంచి రూ.3లక్షల నుంచి రూ.3లక్షల 50 వేల చొప్పున వసూలు చేశాడు. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన రూ.30లక్షల రూపాయలను బంగార్రాజు గోవింద్‌కు ఇచ్చాడు. రోజులు గడుస్తున్నా గోవింద్‌ ఉద్యోగాలు ఇప్పించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదమేర్పడింది. ఈనేపథ్యంలో అక్టోబరు 31న గోవింద్‌ హత్యకు గురైనట్లు డీసీపీ వెల్లడించారు.

అక్టోబర్ 31న కోరాడ లక్ష్మణరావు గెస్ట్‌హౌస్‌ పక్కన బంగార్రాజు మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బంగార్రాజు భార్య నందిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యలో కోరాడ లక్ష్మణరావు, పైడిరాజు, వెంకటేశ్ హస్తం ఉందని మృతుడి బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే లక్ష్మణ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు.

బంగార్రాజు హత్యకేసులో కీలక నిందితుడు వైసీపీ నాయకుడు లక్ష్మణ్‌ కుమార్ ను ఈ కేసునుంచి తప్పించే ప్రయత్నంచేస్తున్నారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. నిస్పాక్షికంగా కేసును దర్యాప్తుచేపట్టాలనివారు డిమాండ్ చేస్తున్నారు. అయితే హత్యజరిగిన అనంతరం మృతదేమానికి పోస్టుమార్టం పూర్తైనా డెడ్ బాడీని తీసుకోకుండా మూడు రోజులపాటు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు బంధువులు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించి... ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖరాశారు. సీపీ హామి ఇవ్వడంతో మృతుని బంధువులు ఆందోళన విరమించి.. మృతదేహాన్ని తీసుకెళ్లారు.

విశాఖ పద్మనాభం మండలం ఏనుగులపాలెంలో గతనెల 31వ తేదీన బంగార్రాజు హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేయడం, నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని మృతుని బంధువులు, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించి ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో కదిలిన పోలీసులు హత్యకేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితుడిని అదుపులోకితీసుకున్నారు. మరికొందరు పరారీలోఉన్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story