Bus Accident : చెట్ల మధ్యలోకి దూసుకెళ్లిన బస్సు

Bus Accident : చెట్ల మధ్యలోకి దూసుకెళ్లిన బస్సు
X

విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంకి రహదారిలో స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ బస్సు సోమవారం ఉదయం ప్రమాదానికి గురైంది. పాండ్రంగి సమీపంలో రహదారి ప్రక్కన పొదల్లోకి దూసుకుపోయి ఓ వైపుకు ఒరిగిపోయింది. తాటి చెట్ల మధ్యలోకి బస్సు దూసుకుపోవడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఉదయం సుమారు 45 మంది విద్యార్థులకు కృష్ణాపురం లో ఉన్న స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాలకు తీసుకువెళ్లే క్రమంలో బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలైన పలువురు విద్యార్థులను రేవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. సుమారు నలుగురికి మినహా మిగతా విద్యార్థులను తల్లిదండ్రులకు యాజమాన్యం అప్పగించింది.రహదారి లో ఓ ప్రక్కకు ఒరిగి చెట్ల పొదల్లోకి దూసుకుపోయిన స్కూల్ బస్సును క్రేన్ ల సహాయంతో పోలీసులు, స్థానికులు బయటికి తీశారు. సంఘటనా స్థలానికి విద్యార్థులు తల్లిదండ్రులు స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పద్మనాభం ఏరియా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.

Tags

Next Story