Alabama: హత్యకు దారితీసిన దొంగతనం.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి..

Alabama: అమెరికా అనేది ఎంత అభివృద్ధి చెందిన దేశమో.. అంతే రక్షణ లేని దేశం కూడా.. అక్కడ ఎప్పుడు ఎవరిని ఎలా చంపుతారో అస్సలు తెలీదు. అలాగే ఎప్పుడు, ఎక్కడ గన్ పేలుడు జరుగుతుందో, ఏ చిన్న దొంగతనం హత్యకు దారితీస్తుందో చెప్పలేం. అలా తాజాగా జరిగిన ఓ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
విశాఖపట్నంకు చెందిన సత్యకృష్ణ చిత్తూరి.. గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తన భార్య గర్భవతి. అయితే అమెరికాలో పైచదువులు చదవాలన్న కోరికతో సత్యకృష్ణ గత నెల ఆ దేశంలో అడుగుపెట్టాడు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు అలబామాలోని బిర్మింగమ్‌లో ఓ క్రౌన్ సర్వీస్ స్టేషన్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఇటీవల సత్యకృష్ణ పనిచేస్తున్న సర్వీస్ స్టేషన్‌లో దొంగలు చొరబడ్డారు.
ఆరు అడుగుల పొడగు ఉన్న ఓ వ్యక్తి బ్లాక్ డ్రెస్ వేసుకొని కాల్పులకు తెగబడ్డాడు. అందులోని ఓ బులెట్ నేరుగా సత్యకృష్ణకు తగలడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సత్యకృష్ణ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. నిందితుడిని సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com