ఫ్రెండ్స్‌కు గంజాయి అలవాటు చేసి భర్తకు ఎరగా వేసిన భార్య.. దారుణం

ఫ్రెండ్స్‌కు గంజాయి అలవాటు చేసి భర్తకు ఎరగా వేసిన భార్య.. దారుణం
X

వెంకన్న కొలువైన తిరుమల, తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. మహిళలకు గంజాయి అలవాటు చేయిస్తున్నారు ఓ భార్య, భర్తలు. వారి న్యూడ్ వీడియోలు తీసి.. మరీ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. తాజాగా ఈ కేసును తిరుపతి పోలీసులు చేధించి.. వారి బండారం బయటపెట్టారు.

తిరుపతిలో కృష్ణా రెడ్డి అలాగే తన భార్య ప్రణవ మోసాలకు పాల్పడుతున్నారు. ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు ప్రణవ కృష్ణా రెడ్డి. కర్నూలుకు చెందిన తన స్నేహితురాలైన ఓ యువతికి గంజాయి అలవాటు తరచూ తన ఇంటికి తీసుకెళ్లిందట ప్రణవ. ఇక గంజాయి మత్తులో ఉన్న యువతిని భర్త క్రిష్ణ కిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించి వీడియోలు తీసిందట ప్రణవకృష్ణా రెడ్డి. అనంతరం… వీడియోలు, ఫోటోలు ఆ యువతి అన్నకు, కాబోయే కుటుంబ సభ్యలకు పంపి డబ్బులు కోసం బ్లాక్ మెయిల్ కూడా చేశారట.

తాజాగా ఎంఆర్ పల్లి పోలీసులను ఆశ్రయించారు కర్నూలుకు చెందిన బాధిత యువతి. గతంలో కూడా ఓ యువతిని మోసం చేసి 5 లక్షలు కాజేసినట్లు విచారణలో వెల్లడైంది. భార్య, భర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

Tags

Next Story