Bihar: కోపంతో భర్త గొంతు కొరికి చంపిన భార్య..

Bihar: ఈరోజుల్లో చిన్న చిన్న కారణాలకు కూడా చావే జవాబు అనుకుంటున్నారు కొందరు. అది ఆత్మహత్య అయినా.. హత్య అయినా.. వీటికి సంబంధించిన ఏ నిర్ణయమయినా చాలా సులువుగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇద్దరు మధ్య చిన్న వాగ్వాదం వచ్చినా హత్య చేయడానికి కూడా వెనకాడట్లేదు. తాజాగా బిహార్‌లో ఆ క్షణికావేశంతోనే భర్త గొంతు కొరికి చంపింది ఓ భార్య.
భార్యాభర్తల మధ్య గొడవలు ఆత్మహత్యతోనో లేదా హత్యతోనో ముగియడం లాంటివి ఈ మధ్య ఎక్కువయ్యింది. మనస్పర్థలు రాగానే ఆవేశంలో విచక్షణ లేకుండా ప్రవర్తిస్తు్న్నారు కొందరు. అలాగే బిహారల్‌లోని రోహతాస్ జిల్లాలో మహర్షి సింగ్ అనే వ్యక్తికి 2020లో పెళ్లి జరిగింది. వీరికి 10 నెలల పాప కూడా ఉంది. అయితే గత కొన్నిరోజులుగా వీరి వైవాహిక జీవితం అంత సాఫీగా సాగట్లేదు.
కొన్ని రోజులుగా మహర్షి సింగ్‌కు, తన భార్యకు గొడవలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇటీవల భార్య, భర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పుడు ఆవేశంలో భార్య మహర్షి సింగ్ గొంతు కొరికేసింది. గట్టిగా కొరికేసరికి తీవ్ర రక్తస్రవంతో మహర్షి కుప్పకూలిపోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించేలోపు మరణించాడు. మహర్షి మరణించినప్పటి నుండి అతడి భార్య పరారీలో ఉందని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com