Kurnool: వివాహేతర సంబంధం.. భర్తను దారుణంగా టవల్‌తో..

Kurnool: వివాహేతర సంబంధం.. భర్తను దారుణంగా టవల్‌తో..
Kurnool: కర్నూల్‌ ఉయ్యాలవాడ గ్రామంలో దారుణం జరిగింది.

Kurnool: కర్నూల్‌ ఉయ్యాలవాడ గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో ప్రబుద్దురాలు. స్థానిక గ్రామానికి చెందిన రామయ్య పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతని భార్య జయలక్ష్మీ.. అదే గ్రామానికి చెందిన మహ్మద్‌ కైజర్‌తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం నడుపుతోంది.

విషయం తెలిసిన రామయ్య.. భార్యను మందలించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించాలనుకున్న జయలక్ష్మీ.. ప్రియుడు కైజర్‌తో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 13 న రామయ్య గొంతుకు టవల్‌ బిగించి హతమార్చి.. డెడ్‌బాడీని హంద్రీనీవా కాలువలోపడేశారు. అనంతరం తండ్రి మరణంపై కూతురు చందన, కుమారుడు శేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు . దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రామయ్య హత్య మిస్టరీని చేధించారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story