Tamil Nadu : సాంబర్‌లో విషం కలిపి భర్తను చంపిన భార్య

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను నాశనం చేస్తున్నాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తకు సాంబార్‌లో విషం కలిపి చంపిన ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది. కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్ ఓ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య అమ్ముబీ, ఓ కూతురు, కొడుకు ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం రసూల్ వాంతులు చేసుకొని, స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు.
వైద్యులు వైద్యపరీక్షలు చేసి రక్తంలో పురుగులమందు అవశేషాలు గుర్తించారు. దీంతో రసూల్ బంధువులు అతడి భార్య వాట్సప్ చాటింగ్ చెక్ చేయగా.. విస్తుపోయే విషయాలు కనిపించాయి. ఆమెకు సెలూన్ షాప్ లోకేశ్వరన్‌తో అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. చాట్‌లో ‘‘నువ్వు ఇచ్చిన విషం ఫస్ట్ దానిమ్మ జ్యూస్‌లో కలిపాను. కానీ నా భర్త అది తాగలేదు. దాంతో ఆహారంలో కలిపాను’’ అని అమ్ముబీ మెస్సేజ్ చేసింది. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న రసూల్ మృతి చెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమ్ముబీ, లోకేశ్వరన్‌లను అరెస్టు చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com