Haryana : రీల్స్ కోసం యూట్యూబర్ తో కలిసి భర్తను చంపిన భార్య

రవీనా (32), ప్రవీణ్ (35) భార్యాభర్తలు. హర్యానాలోని హిసార్ జిల్లా ప్రేమనగర్లో ఉంటున్నారు. అయితే రవీనా.. సురేష్ అనే యూట్యూబర్ తో కలిసి రీల్స్ చేస్తోంది. దీన్ని భర్త ప్రవీణ్ జీర్ణించుకోలేకపోయాడు. రీల్స్ చేయొద్దంటూ భర్తతో పాటు కుటుంబ సభ్యులు వారించారు. ఆమె ఏ మాత్రం లెక్కచేయలేదు. పెడచెవిన పడేసింది. రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో 34, 000 మంది ఫాలోవర్లు పెరిగారు. ఇలా ఏడాదిన్నరగా రీల్స్ చేస్తూ భర్తను ఏ మాత్రం పట్టించుకోకుండా యూట్యూబర్ సురేష్ తోనే కలిసి తిరుగుతోంది. గత నెల మార్చి 25న రవీనా - యూట్యూబర్ సురేష్ ఒక గదిలో అభ్యంతరకర స్థితిలో భర్త ప్రవీణ్ కు కనిపించారు. ఆ సీన్ చూసి ప్రవీణ్ తట్టుకోలేకపోయాడు. దీంతో రవీనాతో ప్రవీణ్ గొడవకు దిగాడు. అంతే రవీనా-సురేష్ కలిసి ప్రవీణ్ గొంతు కోసి చంపేశారు. అదే రాత్రి తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రవీణ్ మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి.. ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు మురికి కాలువలో పడేశారు. అయితే ప్రవీణ్ కుటుంబ సభ్యులు.. రవీనాను ఆరా తీయగా.. తనకు తెలియదని నటించింది. బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మార్చి 28న ప్రవీణ్ మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో కనుగొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవీనా ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా క్రైమ్ వ్యవహారం బయటపడింది.
బైక్ పై ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. తిరిగి అదే బైక్ పై రెండు గంటల తర్వాత వచ్చినప్పుడు మాత్రం రవీనా- సురేష్ మాత్రమే బైక్ పై ఉన్నట్లు కనిపించింది. ఇద్దరిని అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించారు. రవీనా-సురేష్ ను పోలీసులు జైలుకు పంపించారు. ప్రవీణకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడు తాత సుభాష్, మామ సందీప్ దగ్గర నివాసం ఉంటున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com