Crime : అక్రమ సంబంధం పెట్టుకుందని మహిళపై దాడి

నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో 40 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. కలిగిరి గ్రామానికి చెందిన గోసాల మధుకి తన అక్క కూతురితో వివాహం జరిగింది. అయినప్పటికీ, గత కొంత కాలంగా మధు అదే గ్రామానికి చెందిన 40 ఏళ్ల సితారి శ్రీదేవితో అక్రమ సంబంధం పెట్టుకుని ఒకే ఇంట్లో ఉంటున్నారు. శ్రీదేవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త తనను పట్టించుకోకపోవడం, శ్రీదేవి వల్ల తమ కాపురం కూలిపోతుందని భావించిన మధు భార్య కుటుంబ సభ్యులు శ్రీదేవిపై కోపంగా ఉన్నారు. బుధవారం రాత్రి గోసాల మధు కుటుంబ సభ్యులు శ్రీదేవి ఇంటికి వెళ్లి ఆమెపై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడితో శ్రీదేవి స్పృహ కోల్పోయింది. అయితే, స్థానికులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించివేశారు. ఈరోజు ఉదయం 7 గంటలకు శ్రీదేవి కుమారుడు ఇంటికి వెళ్లి చూడగా, ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనతో కలిగిరి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com