Atal Setu : అటల్ సేతుపై మహిళ సూసైడ్ అటెంప్ట్.. కాపాడిన క్యాబ్ డ్రైవర్

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన జరిగింది. ముంబయిలోని అటల్ సేతు బ్రిడ్జిపై ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అయితే అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవర్ చురుగ్గా స్పందించడంతో మహిళ ప్రాణాలతో బతికి బయటపడింది. పోలీసులు సకాలంలో స్పందించటంతో మహిళ ప్రాణాలు దక్కాయి.
ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ విజువల్స్ ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహిళది ముంబయిలోని ములుంద్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల రీమా ముకేశ్‌గా పోలీసులు గుర్తించారు. విజువల్స్ ను ఓసారి విశ్లేషిస్తే.. ఆమె అటల్ సేతుకు చెందిన సేఫ్టీ బారియర్‌పై కూర్చొని ఉంది. తొలుత ఆమె సముద్రంలోకి ఏవో వస్తువులను విసిరేసింది. ఆ తర్వాత ఆమె కూడా అందులోకి దూకబోయింది. అయితే దానిని పసిగట్టిన క్యాబ్ డ్రైవర్ ఆమె జుట్టు, చేతుల్ని గట్టిగా ఒడిసిపట్టుకున్నాడు. అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వెంటనే స్పందించి ఆమెను సేవ్ చేశారు.
క్యాబ్ డ్రైవర్ టైం సెన్స్, క్విక్ రియాక్షన్ కారణంగా ఆమె ప్రాణాలు నిలిచాయి. విలువైన జీవితాన్ని ఎవరూ చేజార్చుకోవద్దని పోలీసులు ఓ మెసేజ్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com