Crime : వైద్యం వికటించి మహిళా మృతి

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని విజయ నర్సింగ్ హోమ్ లో వైద్యం వికటించి వివాహిత భూలక్షి (33) మృతి చెందింది. వివరాల్లోకి వెళితే పేదనెమలిపురి గ్రామానికి చెందిన అంకాల భూలక్ష్మి అనే వివాహిత గత శుక్రవారం తన ఇంట్లో బట్టలు ఉతుకుతుండగా బకెట్లో కనిపించని కీటకం ఏదో చేతికి కుట్టిందని చికిత్స నిమిత్తం మొదటగా పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యం అందించి అనంతరం తిరిగి ఇంటికి తీసుకు వెళ్ళడం జరిగిందని మృతురాలి బంధువులు తెలిపారు మరల నిన్న మృతురాలు తలనొప్పిగా ఉందని పిడుగురాళ్లలోనే విజయ నర్సింగ్ హోమ్ కి తీసుకురావడం జరిగిందని నిన్న సాయంత్రం నుండి ఈరోజు సాయంత్రం వరకు భూలక్ష్మి ఆరోగ్యంగానే ఉందని అందరితో మాట్లాడుతూనే ఉందని కానీ కాంపౌండర్ ఏదో ఇంజక్షన్ ఇస్తున్న సమయంలోనే ఎగస్వాసతో భూలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందిందని ఇది పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం మూలానే భూలక్ష్మి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు భూలక్ష్మి చనిపోయిన వెంటనే డాక్టర్లు వైద్య సిబ్బంది ఆసుపత్రి నుండి పరారవడంతో కోపంతో ఆసుపత్రి అద్దాలు పగలగొట్టి మృతురాలి బంధువులు ధర్నా చేస్తున్నడంతో పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని విచారణ జరుపుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com