Visakhapatnam : పోర్న్ వీడియోలో ఉన్నట్లు చేయాలని భార్యకు వేధింపులు.. ఆత్మహత్య

Visakhapatnam : పోర్న్ వీడియోలో ఉన్నట్లు చేయాలని భార్యకు వేధింపులు.. ఆత్మహత్య
X

విశాఖ జిల్లా గోపాలపట్నంలో విషాదం చోటు చేసుకుంది. భర్త కామవాంఛకు భార్య బలైంది. నాగేంద్ర, వసంతకు 11 నెలల క్రితం పెళ్లైంది. పోర్న్‌ వీడియోలకు బానిసైన నాగేంద్ర అందులో ఉన్నట్లే చేయాలని భార్యను తరచూ ఒత్తిడి చేసేవాడని, దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

ఇక, తీవ్ర రక్త స్రావంతో స్పృహ కోల్పోయిన భార్య వసంత.. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడంతో ఇప్పటి వరకు ఆమె గర్భం దాల్చలేదు.. పోర్న్ వీడియోలు చూసి అడిక్ట్ ఆయినా భర్త.. పోర్న్ వీడియోస్ లో ఉన్న విధంగా శృంగారం చేయాలని భార్యను తీవ్ర ఒత్తిడికి గురి చేసేవాడని బంధువులు చెప్పుకొచ్చారు. భర్త వికృతి చేష్టలకు, ఒత్తిడికి గురై నరక యాతన అనుభవించిన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, అత్తింటివారే తన కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆరోపించింది.

Tags

Next Story