AC Room: ఏసీ రూమ్‌లో దోమలకు పొగ.. ఊపిరాడక ఇద్దరు మృతి..

AC Room: ఏసీ వేసుకుని, దోమలు కుట్టకుండా పొగపెడితే హాయిగా నిద్ర పోవచ్చనుకున్నారు. కానీ ఆ పొగకు ఊపిరాడక ఓ మహిళ, ఆమె మనవడు మృతి చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
55 ఏళ్ల మహిళ, ఆమె 11 ఏళ్ల మనవడు శంకర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పమ్మల్ లోని వారి ఇంటిలో ఊపిరి ఆడక మరణించారు. వారు దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు బొగ్గులు వెలిగించి పొగ పెట్టారు. ఈ పొగ కారణంగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నలుగురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పుష్పవల్లి, ఆమె భర్త చోక్కలింగం (60) ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి. కుమార్తె మల్లికా, మనవడు విశాల్, తిమ్మవల్లూవర్ వీధి, పొన్నీ నగర్, పమ్మల్ లోని తమ ఇంటిలో గ్రౌండ్‌ప్లోర్‌లో ఉంటున్నారు. వారు బుధవారం రాత్రి నిద్రలోకి జారుకున్నారు. వాటర్ పంప్ ఆన్ చేయడానికి తలుపు తట్టారు అద్దెకుంటున్న సుబ్రమణి. కానీ ఆమె పిలుపుకు ఇంట్లో ఎవరూ స్పందించలేదు.
దీంతో అనుమానం వచ్చిన ఆమె తన కొడుకుతో పాటు ఇరుగు పొరుగు వారిని పిలిచి తలుపులు తెరిచారు. గదిలో పడుకున్న నలుగురూ అపస్మారక స్థితిలో ఉన్నట్లు కనుగొన్నారు. వారిని క్రోంపేట్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పుష్పవల్లి చనిపోయినట్లు ప్రకటించారు. మిగిలిన వారిని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు, 11 ఏళ్ల విశాల్‌ని పిల్లల ఆసుపత్రి తరలించమని సూచించారు. కాగా విశాల్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించాడు.
పోలీసు అధికారి మాట్లాడుతూ, "దోమల నివారణకు వారు టిన్ బాక్స్‌లో బొగ్గులు వేసి నిప్పంటించారు. ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నందున తలుపులు, కిటికీలు మూసి ఉంచారు. గదిని ఆవరించిన పొగ నిద్రిస్తున్న వారికి ఊపిరి ఆడకుండా చేసింది" అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com