TG : ట్రావెల్స్​ బస్సులో రేప్​.. డయల్‌100కు కాల్‌ చేసిన మహిళ

TG : ట్రావెల్స్​ బస్సులో రేప్​.. డయల్‌100కు కాల్‌ చేసిన మహిళ
X

తెలంగాణలో నిర్భయ తరహాలో కదులుతున్న బస్సులో ఓ మహిళపై డ్రైవర్​ అత్యాచారం చేయడం కలకలం రేపింది. ట్రావెల్స్‌ బస్సులో డ్రైవర్‌ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని నిర్మల్‌ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు డ్రైవర్లు మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బస్సు కదులుతూ ఉండగానే.. బాధిత మహిళ డయల్‌100కు కాల్‌ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓయూ పోలీస్​ స్టేషన్​ వద్ద బస్సును ఆపి సీజ్‌ చేశారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో డ్రైవర్‌(ప్రధాన నిందితుడి) కోసం గాలిస్తున్నట్లు సీఐ రాజేందర్‌ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

Tags

Next Story