West Bengal : భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో మహిళ పరార్

ఓ కిలాడీ మహిళ భర్తనే నమ్మించి నట్టేట ముంచింది. మాయమాట లు చెప్పి తన భర్త కిడ్నీ అమ్మించింది. ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో పరారైంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. హౌరా జిల్లాకు చెందిన ఓ మహిళ తమ కుమార్తె చదువు, వివాహానికి కావాల్సిన డబ్బు కోసం కిడ్నీ అమ్మాలని భర్తపై ఒత్తిడి తీసుకొచ్చింది. అలాచేస్తే తమ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించింది. భార్య మాటకు కాదనలేక సదరు భర్త రూ.10 లక్షలకు కిడ్నీ విక్రయించాడు. అయితే, ఆ డబ్బుతో భార్య పరారైంది. ఫేస్బుక్ లో పరిచయమైన రవిదాస్ అనే వ్యక్తితో ఉడాయించింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధిత భర్త తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఆమె ఆచూకీ గుర్తించి అక్కడకు పోలీసులు చేరుకున్నారు. వారితోపాటు భర్త కూడా వెళ్లాడు. అయితే భర్తతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించింది. ఎక్కువ మాట్లాడితే విడాకులు ఇస్తానని బెదిరించింది. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చిన భర్త, తన పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com