Visakhapatnam: పుస్తకాలు, పెన్నులు అవే వారి ఆయుధాలు.. వీటితో చిన్నారులపై..

X
ప్రతీకాత్మక చిత్రం (tv5news.in)
By - Divya Reddy |6 Dec 2021 7:45 PM IST
Visakhapatnam: విశాఖలో రౌడీషీటర్ చిన్నారావుకు స్థానిక మహిళలు దేహశుద్ధి చేశారు.
Visakhapatnam: విశాఖలో రౌడీషీటర్ చిన్నారావుకు స్థానిక మహిళలు దేహశుద్ధి చేశారు. మార్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్నాళ్లుగా పుస్తకాలు, పెన్నులు ఆశచూపి మైనర్ బాలికలపై చిన్నారావు అఘాయిత్యానికి పాల్పడుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. రౌడీషీటర్ వేధింపులను బాలికలు తొలుత ట్యూషన్ టీచర్లకు చెప్పారు. ఆ తర్వాత ఉపాధ్యాయులు బాలికల తల్లిదండ్రులకు తెలిపారు. అందరూ కలిసి చిన్నారావును చితక్కొట్టారు. రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్న రౌడీషీటర్ చిన్నారావు.. వెల్ఫేర్ సొసైటీ ముసుగులో బాలికలను వేధిస్తున్నారని మహిళలు ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com