Kurnool: కర్నూలులో వైసీపీ కార్యకర్త ఆత్మహత్య.. చావుకు కారణం వారే అంటూ సూసైడ్ నోట్..

Kurnool: చేసిన పనులకు బిల్లులు రాక కర్నూలు జిల్లాలో వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు.. ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన మహబూబ్ బాషా నాడు-నేడు, రైతు భరోసా కింద కాంట్రాక్టు పనులు చేశాడు.. ఇందు కోసం 80 లక్షల రూపాయలు బయట అప్పులు తెచ్చాడు.. అయితే, కాంట్రాక్టు పనులు పూర్తయినా ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో అప్పుల వాళ్ల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయాయి..
ఒత్తిళ్లు తట్టుకోలేక ఈనెల ఆరున వూరు వదలి వెళ్లిపోయాడు మహబూబ్ బాషా.. దీంతో ఆందోళన పడ్డ కుటుంబ సభ్యులు ఓర్వకల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. అయితే, నంద్యాల జిల్లా వెలుగోడులోని తన పొలంలో పురుగుల మందు తాగి మహబూబ్ బాషా ఆత్మహత్య చేసుకున్నాడు.. మృతుడు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com