వైసీపీ ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఉపసర్పంచ్ ఆత్మహత్య

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఉపసర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అలజంగి గ్రామంలో జరిగింది. ఉపసర్పంచ్ లక్ష్మీనాయుడుపై.... బొబ్బొలి ఎమ్మెల్యే వెంకట అప్పలనాయుడు వేధింపులు గురి చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు తమ్ముడు కలిసి మానసికంగా ఇబ్బందులు గురి చేసినట్లు తెలుస్తోంది. దీంతో మనోవేదనకు గురైన లక్ష్మీనాయుడు పురుగులు మందు తాగాడు. దీంతో అతన్ని హుటాహుటిన... చికిత్స కోసం విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు లక్ష్మీనాయుడు. దీంతో కుటుంబు సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఉపసర్పంచ్ లక్ష్మినాయుడు జేబులో లేఖ లభించడం కలకలం రేపింది. వైసీపీకి గట్టి మద్దతుదారునిగా ఉంటూ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిపించానని అయినా... తనకు గౌరవం లభించలేదని లేఖలో పేర్కొన్నారు.పార్టీ పెద్దలకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు సరికదా తిరిగి చులకనగా చూస్తూ అగౌరవంగా మాట్లాడారన్నారు. గ్రామంలో సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించిన బిల్లుల చెల్లింపు జరగలేదన్నారు. ఇంజనీరింగ్ ఉద్యోగి ఏ మాత్రం సహకరించలేదంటూ లేఖలో తెలిపారు. పార్టీ మీటింగులకు, ప్రభుత్వ కార్యక్రమాలకు కార్యకర్తలను తన సొంత డబ్బుతో ఆటోలు, ఇతర వాహనాల్లో తరలించేవాడినని...పార్టీ పెద్దలు సహకరించకుండా ముఖం చాటేస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు.
అయితే ఈలేఖలో సంతకం లేదు. రాజకీయ కారణాలతో ఎవరైనా ఆయన జేబులో లేఖను పెట్టి ఉండవచ్చంటున్నారు పోలీసులు. గ్రామానికి వెళ్లి విచారించామని, ఆయనకు వ్యక్తిగతంగా ఏవో సమస్యలున్నాయని, ఎఫ్‌ఐఆర్ అయ్యాక పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. లక్ష్మునాయుడు జేబులో లభించిన లేఖ ఒరిజినల్ కాదని, జిరాక్స్ కాపీ అని, అందులో హేతుబద్ధత కనిపించలేదంటున్నారు పోలీసులు. ఆయనకు పెద్దగా చదువురాదని, ఇంకెవరితోనైనా రాయించారన్న కోణంలో దర్యాప్తుచేస్తున్నామని అన్నారు. రాజకీయ కారణాలతో ఎవరైనా ఆయన జేబులో లేఖను పెట్టి ఉండవచ్చని, దీన్ని సూసైడ్ నోట్‌గా పరిగణించలేమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com