క్రైమ్

పెళ్లి పేరిట యువతులను మోసం.. 11మంది అమ్మాయిలను..!

చిత్తూరు జిల్లాలో కేటుగాడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.సోషల్‌ యాప్‌ల ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకుని.. పెళ్లి పేరిట నమ్మబలికి యువతుల నుంచి కోట్లు కొట్టేశాడు కేటుగాడు.

పెళ్లి పేరిట యువతులను మోసం.. 11మంది అమ్మాయిలను..!
X

చిత్తూరు జిల్లాలో కేటుగాడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.సోషల్‌ యాప్‌ల ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకుని.. పెళ్లి పేరిట నమ్మబలికి యువతుల నుంచి కోట్లు కొట్టేశాడు కేటుగాడు. నిందితుడు శ్రీనివాస్ పై గతంలోనూ సైబరాబాద్‌, మియాపుర్‌, రాయదుర్గ పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడి గ్రామానికి చెందిన పున్నాటి శ్రీనివాస్‌..మ్యాట్రిమోనీ, డేటింగ్‌ యాప్‌ల ద్వారా యువతులను పరిచయం చేసుకున్నాడు. వారిని చాటింగ్‌ పేరిట ముగ్గులోకి దింపి పెళ్లి పేరుతో నమ్మబలికించి మూడు కోట్లు కొట్టేశాడు. ఇలా మోసపోయిన యువతుల్లో.. ఒంగోల్‌కు చెందిన ఐటీ ఉద్యోగిని నుంచి 27 లక్షలు.. నరసరావుపేటకు చెందిన మరో ఐటీ ఉద్యోగిని నుంచి 40 లక్షలు.. చిత్తూరుకు చెందిన యువతి నుంచి లక్ష 40 వేలు.. మదనపల్లెకు చెందిన వైద్యురాలు నుంచి 7 లక్షలను.. నిందితుడు కొట్టేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు మరికొంతమంది బాధిత యువతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

RELATED STORIES