Crime : ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్...

ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెందుర్తి సుజాతానగర్ లో నివాసం ఉంటున్న మృతుని తండ్రి చంద్రశేఖర్ స్థాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్ (26) కొంతకాలం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమలో పనిచేసి, ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి తండ్రి చంద్రశేఖర్ ను ఐఫోన్ కొని ఇవ్వాలని అడిగేవాడు.. ఈ ఫోన్ విషయమై ఇద్దరి మధ్య వాగ్వివాదం కూడా జరిగింది.. అనంతరం గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్న.. కెవిన్ సాయంత్రమయినా బయటకు రాకపోవడం పై అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపును బలవంతంగా తెరవడంతో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు.. తల్లిదండ్రులు మృతుడు కేవెన్ ను దించగా అప్పటికే మృతిచందాడు.. సమాచారం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్దమ్ నిమిత్తం కె జి హెచ్ కు తరలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెందుర్తి పోలీసులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com