క్రైమ్

ప్రేమ వ్యవహారం.. యువకుడిని గొడ్డలితో నరికి..

ప్రేమ వ్యవహారం.. యువకుడిని గొడ్డలితో నరికి..
X

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. ప్రణయ్ అనే యువకుడిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రణయ్‌కి, అదే గ్రామానికి చెందిన యువతికి మధ్య కొన్నాళ్లుగా ప్రేమవ్యవహారం సాగుతోందని పోలీసులు గుర్తించారు. ఆ ప్రేమ వ్యవహారమే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు భావిస్తూ ఆ దిశగా విచారణ చేపట్టారు.

డ్రైవర్‌ ప్రణయ్‌ అదే గ్రామానికి చెందిన తన సామాజిక వర్గానికి చెందిన యువతి గాఢంగా ప్రేమిస్తున్నాడు. గతంలో ఇరు కుటుంబాల మధ్య ఈ ప్రేమ వ్యవహారం విషయంలో పంచాయితీలు కూడా జరిగాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆ యువతితో ప్రణయ్‌ మాట్లాడుతుండడాన్ని ఆమె అన్నయ గమనించి ఉంటాడని.. వెంటనే ఆవేశంతో.. ప్రణయ్‌పై దాడి చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం అంబేద్కర్‌ భవన్‌ దగ్గర ప్రణయ్‌ మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Next Story

RELATED STORIES