ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ఈ దుర్మార్గాన్ని చూసిన మరో బాలిక గొంతుకోశారు దుండగులు.

ఆంధ్రా - ఒరిస్సా బార్డర్‌లో దారుణం జరిగింది. సుర్ల గ్రామంలో మానవమృగాలు బరితెగించాయి. తొమ్మిదేళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ దుర్మార్గాన్ని చూసిన మరో బాలిక గొంతుకోశారు దుండగులు. ప్రాణాపాయస్థితిలో ఉన్న బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా అనుమానిస్తున్నవారిని స్థానికులు స్తంభానికి కట్టేసి చావబాదారు. చిన్నారిపై జరిగిన దారుణంతో కోపోధ్రిక్తులైన జనం.. వారిని చితగ్గొట్టారు. కేసు నమోదు చేసుకున్న సోనాపూర్ పోలీసులు దర్యాప్తున్నారు. ఈ ఘటనతో సుర్లగ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


Tags

Read MoreRead Less
Next Story