సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం

విశాఖ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో.. చందనోత్సవం ప్రారంభమైంది. అక్షయ తృతీయ నాడు స్వామివారు నిజరూప దర్శనం ఇస్తున్నారు. ఏడాది పొడవునా చందన మాటున ఉండే స్వామికి.. అర్ధరాత్రి తర్వాత వేద మంత్రోచ్చారణ మధ్య చందనాన్ని ఒలిచారు ఆలయ పండితులు. తెల్లవారు జామున 2 గంటలకు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఇచ్చారు. అనువంశిక ధర్మకర్త అయిన. అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా తొలి దర్శనం చేసుకున్నారు. స్వామివారికి..టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి
అయితే దర్శనం కోసం అష్టకష్టాలు పడుతున్నారు అప్పన్న భక్తులు. ప్రోటోకాల్ పాస్‌లు ఉన్నా తిప్పలు తప్పడం లేదు. ఎంపీ, ఎమ్మెల్యేకు ఘోర అవమానం జరిగింది. ప్రోటోకాల్ విషయంలో అధికారులు అట్టర్ ప్లాప్ అయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. సీనియర్ అధికారులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు సీనియర్ జడ్జిలు కూడా దర్శనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఏకంగా విశాఖ గ్రేటర్ కమిషనర్ ను పక్కకు నెట్టేశారు సెక్యూరిటీ సిబ్బంది. అయితే ఆలయ సిబ్బంది సన్నిహితులకు మాత్రం త్వరగా దర్శనం అయిపోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com