అట్టహాసంగా గంగా నది పుష్కరాలు

గంగా నది పుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు పుష్కర స్నానం ఆచరించేందుకు వారణాసికి తరలివచ్చారు. దక్షిణ భారతదేశానికి చెందిన భక్తుల సమక్షంలో కాశీలో మహా హారతి, పూజా కార్యక్రమాలు జరిగాయి. వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. తొలిరోజే కాశీలో తెలుగులో ప్రత్యేక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. 12 రోజులూ భక్తులకు అన్నదానం చేసేందుకు వారణాసిలోని ఆంధ్రా ఆశ్రమం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గంగోత్రి, గంగా సాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్‌నాథ్, అలహాబాద్ క్షేత్రాల్లో ఘాట్లు సిద్ధమయ్యాయి. వారణాసి క్షేత్రంలో గంగా పుష్కర స్నానాల కోసం 64 ఘాట్‌లు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 22 నుంచి మే 3వ తేదీ వరకు.. 12 రోజులపాటు గంగా పుష్కరాలు జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com