నిజరూప దర్శనం.. నిజంగా దారుణం

విశాఖ సింహాచలంలో వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని అప్పన్నస్వామి నిజరూప దర్శనం వైభవోపేతంగా జరిగింది. ఉత్సవాలకి లక్షలాది మంది భక్తులు సింహగిరికి తరలివచ్చారు. దేవాదాయ శాఖ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు దర్శనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాన్య భక్తులను పట్టించుకోకుండా వీఐపీలకు మాత్రమే దర్శనం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణలను ఏర్పాట్లపై నిలదీశారు. ఆధికారుల తీరుకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. సామాన్యులకు త్వరగా దర్శనాలు కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అసహనం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు ఏ మాత్రం బాగాలేవని మండిపడ్డారు. పదిహేను వందల టికెట్లు కొనుగోలు చేసినా క్యూలైన్లు కదల్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com