ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
మే, జూన్‌ నెలకు సంబంధించిన 3వందల రూపాయల ప్రవేశ దర్శన టికెట్లను ఉదయం 10గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్న టీటీడీ

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ (మంగళవారం) ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. మే, జూన్‌ నెలకు సంబంధించిన 3వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఉదయం 10గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని ఈ మేరకు భక్తులకు సూచించింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్‌ను కూడా వినియోగించవచ్చని స్పష్టం చేసింది.

Tags

Next Story