ఆరు నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం

ఆరు నెలల తర్వాత ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకుంది. మంత్రోచ్ఛరణల మధ్య పీఠాధిపతులు, వేద పండితులు ఆలయ ద్వారాలు తెరిచారు. అనంతరం ఉఖీ మఠ్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఛార్‌ధామ్‌లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా ఏటా శీతాకాలంలో దీపావళి పండుగ తర్వాత మూసివేయడం ఆనవాయితీ. శీతాకాలం నేపథ్యంలో ఆరు నెలల క్రితం ఆలయ ద్వారాలను మూసివేసిన పూజారులు.. పూజల కోసం ఉత్సవ విగ్రహాన్ని ఉఖీ మఠ్‌కు తరలించారు. మంచుకొండలు మధ్యలో పర్వత శిఖరాన ఉన్న ఆలయం శీతాకాలంలో మంచుతో నిండిపోతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారీనాథ్ ఆలయం సముద్ర మట్టానికి 3వేల 583 అడుగుల ఎత్తులో మందాకినీ నది ఒడ్డున ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com