అప్పన్న దర్శనంలో అందుకే అవకతవకలు..వాస్తవాలు మాట్లాడిన మంత్రి

సింహాచలం చందనోత్సవంలో భక్తుల నుంచి మంత్రులకు నిరసన సెగ తగిలింది.. వీవీఐపీ టిక్కెట్లు కొనుగోలు చేసిన గంటల తరబడి క్యూ లైనల్లో ఉండిపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. అయితే భక్తుల కష్టాలపై వివరణ ఇచ్చే ప్రయత్నంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాటల్లో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఒక్కో ప్రజాప్రతినిధికి 20 టిక్కెట్లు ఇచ్చామని,వారి కేడర్‌కు కూడా దర్శనం చేయించాయంటూ గొప్పగా చెప్పారు మంత్రి. ప్రోటోకాల్ దర్శనాలు ఆరువేల నుంచి ఎనిమిదికి పెంచామని,కానీ ఊహించని దాని కంటే ఎక్కువ ప్రోటోకాల్ దర్శనాలు జరిగాయని అందుకు కారణం ప్రజాప్రతినిధుల ఒత్తిడే అంటూ కవర్ చేశారు. భక్తుల కష్టాలకు దేవాదాయ శాఖ వైఫల్యం కాదన్న మంత్రికిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు మంత్రి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com