రేపే రామకృష్ణ మఠం ఆర్యజనని వర్క్‌షాప్

Aaryajanani WorkShop: రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఆర్యజనని కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్తమ సంతానం కోసం ఎటువంటి మార్గాలు అనుసరించాలో తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికోసం ఉత్తమమైన భవిష్యత్ తరాలను తయారు చేసే లక్ష్యంతో ఆర్యజనని బృందం వర్క్ షాప్‌లు నిర్వహిస్తోంది. ఆర్యజనని టీమ్‌లో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సైకాలజిస్టులు కూడా ఉన్నారు. వీరంతా విలువైన సూచనలిస్తూ కాబోయే తల్లిదండ్రులకు మార్గనిర్దేశనం చేస్తారు. ఆగస్ట్ 14వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ వర్క్ షాప్ నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా తల్లితో పాటు కడుపులో పెరుగుతున్న శిశువు శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలను ఆర్యజనని బృందం వివరిస్తుంది. ధ్యానం, భజనలు, యోగాసనాలు తదితర విషయాలు నేర్పడంతోపాటు, బిడ్డ ఎదుగుదలలో వాటి ప్రాధాన్యతను సవివరంగా చెప్తారు. అలాగే గర్భిణులకు ఉపయోగపడే దినచర్యను ఉపదేశిస్తారు. ఈ కార్యక్రమంలో తమ పేరు నమోదు చేసుకోవాలని అనుకున్న వాళ్లు www.aaryajanani.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు తెలిపారు.
శిశువు గర్భస్థ దశలో ఉన్నప్పుడు లభించే ప్రేరణ, సంస్కారమే.. ఆ శిశువు అద్భుతమైన వ్యక్తిగా ఎదగడానికిగానీ లేదంటా చెడుగా మారడానికిగానీ కారణభూతం అవుతుందని ఆర్యజనని బృందం వివరిస్తుంది. సంస్కారవంతులైన, దైవం పట్ల భక్తి, శ్రద్ధలు కలిగిన తల్లులకు ఉన్నతమైన బిడ్డలు జన్మిస్తారని స్వామి వివేకానంద చెప్పిన మాటల స్ఫూర్తితో ఆర్యజనని కార్యక్రమం రూపుదిద్దుకుంది. శిశువు జననానికి సంబంధించిన ఆధునిక విజ్ఞానం కూడా ఈ కార్యక్రమం ద్వారా అందించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com