Horoscope Today: ఈ రాశివారికి ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది

Daily Horoscope Rasi Phalalu

Daily Horoscope

Horoscope Today: ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు ఈ విధంగా ఉన్నాయి.

ఈ రోజు పంచాంగం

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం | సూర్యోదయం : 5.36| సూర్యాస్తమయం సా.6.34| తిథి శు.షష్టిఉ.4.10 వరకు తదుపరి సప్తమి శుక్రవారం వరకు|నక్షత్రం ఉత్తర రా.2.22 వరకు| తదుపరి హస్త|రాహుకాలం : ప. 1.30 నుంచి 3.00 వరకు| యమగండం ఉ.06.00 నుంచి 07.30 వరకు| వర్జ్యం ఉ.09.58 నుంచి 11.34 వరకు| దుర్ముహూర్తం ఉ.09.55 నుంచి 10.47 వరకు పున: మ. 3.06 నుంచి 3.58 వరకు| అమృతఘడియలు రా.07.20 నుంచి 8.54 వరకు

ఈ రోజు రాశిఫలాలు

మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగిపోతాయి.

వృషభరాశి: ఈ రాశివారికి పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చేసేఏపనిలోనైనా శ్రమాధిక్యంగా ఉంటుంది. ఇంటాబయటా బంధుమిత్రుల నుంచి విమర్శలు వస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

మిథునరాశి: ఈ రాశివారికి ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. వీరికి ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ధనలబ్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకరాశి: ఈ రాశివారికి సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. పనుల్లో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహరాశి: ఈ రాశివారికి రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్యారాశి: ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ మరింత పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తులారాశి: ఈ రాశివారికి పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికరాశి: ఈ రాశివారికి మిత్రుల సహాయసహకారాలు అందుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. ఊహించని నిర్ణయాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన అవకాశాలు.

ధనుస్సురాశి: ఈ రాశివారికి అధికంగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరరాశి: ఈ రాశివారికి ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభరాశి: ఈ రాశివారికి చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి.

మీనరాశి: ఈ రాశివారికి శ్రమాధికంగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వీరి ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు చేసుకుంటారు. బంధువులతో గొడవలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు.


Tags

Read MoreRead Less
Next Story