Horoscope Today: ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి..!
మేషం: పనులలో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం.
వృషభం: విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో విభేదాలు పరిష్కారం. ముఖ్యులతో పరిచయాలు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.
మిథునం: మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. కొన్ని పనులలో ఆటంకాలు. పనులలో ఆటంకాలు.
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణయత్నాలు. ఇంటాబయటా వివాదాలు. శ్రమ తప్పదు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.
సింహం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. కుటుంబ సమస్యలు తీరతాయి. ప్రముఖుల ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వాహనయోగం.
కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
వృశ్చికం: పనులు కొంత మందగిస్తాయి. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పకపోవచ్చు. విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. దైవదర్శనాలు.
ధనుస్సు: వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
మకరం: చిన్ననాటి మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు శుభవార్తలు.
కుంభం: చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వస్తులాభాలు. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మీనం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. రుణయత్నాలు. పనుల్లో అవరోధాలు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com