Horoscope Today:ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది

Horoscope Today:ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది
Horoscope Today: వివిధ రాశుల వారి దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొండి.

ఈ రోజు పంచాంగం

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శనివారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం | సూర్యోదయం : 5.36| సూర్యాస్తమయం సా.6.34| తిథి శు.అష్టమి రా.12.10 వరకు తదుపరి నవమి ఆదివారం వరకు|నక్షత్రం చిత్త రా.12.44 వరకు| తదుపరి స్వాతి|రాహుకాలం : ఉ. 9.00 నుంచి 10.30 వరకు| యమగండం ఉ.1.30 నుంచి 03.00 వరకు| వర్జ్యం ఉ.08.58 నుంచి 10.34 వరకు పున: ఉ.5.18 నుంచి 5.36 వరకు| దుర్ముహూర్తం ఉ.05.35 నుంచి 07.25 వరకు | అమృతఘడియలు సా.06.00 నుంచి 7.30 వరకు

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: ఈ రాశివారికి విశ్రమఫలితాలు గోచరిస్తున్నాయి. వేషం వారు తమ నిర్ణయాలు మార్చుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి.

వృషభరాశి: ఈ రాశివారికి వాహనయోగం ఉంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునరాశి: ఈ రాశివారు తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయి. రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.

కర్కాటకరాశి: ఈ రాశివారు దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహరాశి: ఈ రాశివారికి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్యారాశి: ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. రుణాలు చేయాల్సిన పరిస్థితి. వ్యవహారాలలో ఆటంకాలు. బంధుమిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

తులారాశి: ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. ఆసక్తికర సమాచారం. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

వృశ్చికరాశి: ఈ రాశివారు ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. బధువుల కలయిక. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి.

ధనుస్సురాశి: వీరికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక ప్రగతి. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. పాతమిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.

మకరరాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో వాయిదా. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.

కుంభరాశి: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనరాశి: ఈ రాశివారికి సన్నిహితుల నుంచి ధనలాభం ఉంటుంది. పనులలో విజయం. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

Tags

Read MoreRead Less
Next Story