Horoscope Today: ఈ రోజు మీ రోజు ! ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

Daily Horoscope Rasi Phalalu

 Horoscope 

Horoscope Today: వివిధ రాశుల వారి శుభాశుభ ఫలితాలు ఇలా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శుక్రవారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.39| సూర్యాస్తమయం సా.6.33| తిథి శు.చతుర్థశి ప.10.07 వరకు తదుపరి పౌర్ణమి శనివారం వరకు|నక్షత్రం పూర్వాషాడ ప.04.07 వరకు| తదుపరి ఉత్తరాషాఢ|రాహుకాలం ఉ. 10.30 నుంచి 12.00 వరకు| యమగండం ప.03.00 నుంచి 04.30 వరకు| వర్జ్యం రా.10.11 నుంచి 11.59 వరకు| దుర్ముహూర్తం ఉ.08.12 నుంచి 09.04 వరకు పున: మ. 12.31 నుంచి 1.23 వరకు | అమృతఘడియలు ప.10.17 నుంచి 11.46 వరకు

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: ఈ రాశివారికి వ్యవహారాలు మందగిస్తాయి. ఏ పనిలోనైనా శ్రమాధిక్యం. దూరప్రయాణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభరాశి: ఈ రాశివారు ఈ రోజు మిత్రులతో అకారణంగా విభేదాలు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునరాశి: ఈ రాశివారికి కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. గ్రీటింగ్‌లు, శుభవార్తలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహం.

కర్కాటకరాశి: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహరాశి: ఈ రాశి వారికి విశ్రమ ఫలితాలు స్వల్ప ధనలాభం. కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్యారాశి: ఈ రాశివారికి ఆప్తుల నుంచి ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

తులారాశి: ఈ రాశివారు పనుల్లో విజయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. చర్చల్లో పురోగతి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.

వృశ్చికరాశి: ఈ రాశివారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త మార్పులు.

ధనుస్సురాశి: ఈ రాశివారు ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరరాశి: ఈ రాశివారికి వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

కుంభరాశి: ఈ రాశివారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ప్రత్యేక గౌరవం. కీలక నిర్ణయాలు. ఆసక్తికర సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనరాశి: ఈ రాశివారికి శుభఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. పనుల్లో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

Tags

Read MoreRead Less
Next Story