Horoscope Today: ఈ రాశివారికి ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి

Horoscope Today: ఈ రాశివారికి ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి
Horoscope Today: వివిధ రాశుల వారి దినఫలాలు ఈ విధంగా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగళవారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.39| సూర్యాస్తమయం సా.6.33| తిథి శు. చవితి తె.04.17 వరకు తదుపరి పంచమి బుధవారం వరకు|నక్షత్రం శతభిషం ప.12.52 వరకు| తదుపరి పూర్వాభద్ర|రాహుకాలం ప. 03.00 నుంచి 04.30 వరకు| యమగండం ప.9.00 నుంచి 10.30 వరకు| వర్జ్యం సా.7.26 నుంచి 09.04 వరకు| దుర్ముహూర్తం ఉ.08.12 నుంచి 09.04 వరకు | అమృతఘడియలు ఉ.05.39 నుంచి 07.16 వరకు

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సోదరుల ద్వారా ధనలబ్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.

వృషభరాశి: సన్నిహితులు సాయపడతారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునరాశి: .మిత్రులతో విభేదాలు. అనుకున్న పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత చికాకులు.

కర్కాటకరాశి: శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

సింహరాశి: కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాల ప్రస్తావన. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్యారాశి: కొత్త రుణాలు చేస్తారు. శ్రమాధిక్యంతో పనులు పూర్తి. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం.

తులారాశి: ఆశయాలు నెరవేరతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో సమస్యలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు అనుకున్న విధంగా కొనసాగుతాయి.

వృశ్చికరాశి: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

ధనుస్సురాశి: రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.

మకరరాశి: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో మరింత గౌరవం. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

కుంభరాశి: మిత్రులు శత్రువులుగా మారవచ్చు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. అనుకున్న పనులు ముందుకు సాగవు. కుటుంబంలో ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనరాశి: శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంతమేర సమస్యలు.

Tags

Next Story