ఈ రోజు మీరోజు ! ఈ రాశివారు శుభవార్తలు వింటారు

ఈ రోజు మీరోజు ! ఈ రాశివారు శుభవార్తలు వింటారు
Horoscope Today: వివిధ రాశుల వారి శుభాశుభ ఫలితాలు ఇలా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శనివారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.39| సూర్యాస్తమయం సా.6.33| తిథి శు. సప్తమి పూర్తి శనివారం ఉ.06.29 వరకు తదుపరి అష్టమి|నక్షత్రం అశ్వని సా.06.14 వరకు| తదుపరి భరణి|రాహుకాలం ఉ. 09.30 నుంచి 10.30 వరకు| యమగండం ప.1.00 నుంచి 03.30 వరకు| వర్జ్యం ప. 1.56 నుంచి 3.40 పున. 4.50 నుంచి 5.42 వరకు| దుర్ముహూర్తం సూర్యోదయం నుంచి ఉ.07.20వరకు | శుభసమయం ఉ.08.00 ని.

ఈ రోజు రాశి ఫలాలు

మేషం: ఈ రాశివారికి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. ధనవ్యయం. విద్యార్థులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

వృషభం: ఈ రాశివారు పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

మిథునం: ఈ రాశివారికి పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: ఈ రాశివారు చిన్ననాటి మిత్రుల కలయిక. ధన,వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: ఈ రాశివారు కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కన్య: ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

తుల: ఈ రాశివారికి బంధువులతో సఖ్యత. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: ఈ రాశివారికి కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

ధనుస్సు: ఈ రాశివారికి నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి. నూతన వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావర ణం.

మీనం: ఈ రాశివారికి విశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరు ఈ రోజు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. పనులు అనుకున్న విధంగా పూర్తి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కార్యసిద్ధి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయకలుగుతారు.

Tags

Read MoreRead Less
Next Story