Horoscope Today: ఈ రోజు మీరోజు ! ఈ రాశి వారి ఆస్తి వివాదాలు తీరతాయి
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| బుధవారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.42| సూర్యాస్తమయం సా.6.31| తిథి శు. ఏకాదశి ప.2.09 వరకు తదుపరి ద్వాదశి| నక్షత్రం మృగశిర రా.04.22 వరకు|రాహుకాలం ప. 12.00 నుంచి 1.30 వరకు| యమగండం ఉ 7.30 నుంచి 09.00 వరకు| వర్జ్యం ఉ.8.00 నుంచి 9.42 వరకు| దుర్ముహూర్తం ప.11.39 నుంచి 12..07వరకు | శుభసమయం ఉ.07.00 ని.
ఈ రోజు రాశి ఫలాలు
మేషం: ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం: ఈ రాశివారికి కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మిథునం: ఈ రాశివారికి వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.
కర్కాటకం: ఈ రాశివారికి వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.
సింహం: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కార్యజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య: ఈ రాశివారికి యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.
తుల: ఈ రాశివారికి కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
వృశ్చికం: ఈ రాశివారికి వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో విభేదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
ధనుస్సు: ఈ రాశివారికి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం..
మకరం: ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కుంభం: ఈ రాశివారికి ఆకస్మిక ధనలబ్ధి. ఏ పని చేపట్టినా విజయమే. ఆప్తుల సలహాలు పొందుతారు. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
మీనం: ఈ రాశివారికి కుటుంబ సమస్యలు. కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com