Horoscope Today: ఈ రోజు మీ రోజు..! ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి

Horoscope Today: ఈ రోజు మీ రోజు..! ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
Horoscope Today: వివిధ రాశుల వారి దినఫలాలు ఈ విధంగా ఉన్నాయి

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శుక్రవారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.42| సూర్యాస్తమయం సా.6.31| తిథి శు. త్రయోదశి సా.5.19 వరకు| నక్షత్రం పునర్వసు |రాహుకాలం ఉ. 10.30 నుంచి 12.00 వరకు| యమగండం ప 3.00 నుంచి 04.30 వరకు| వర్జ్యం రా.7.33 నుంచి 9.18 వరకు| దుర్ముహూర్తం ప.08.18 నుంచి 09.10వరకు | శుభసమయం ఉ.07.00 ని.

ఈ రోజు రాశి ఫలాలు

మేషం: ఈ రాశివారికి వ్యయప్రయాసలు అధికం. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

వృషభం: ఈ రాశివారికి పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

మిథునం: ఈ రాశివారికి సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశివారికి శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

సింహం:ఈ రాశివారికి వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ప్రయాణాలు రద్దు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: ఈ రాశివారికి కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.

తుల: ఈ రాశివారికి శుభవర్తమానాలు. రావలసిన సొమ్ము అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం: ఈ రాశివారికి సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలలో నిరాశ.

ధనుస్సు: ఈ రాశివారికి అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. కొన్ని పనులలో ఆటంకాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

మకరం: ఈ రాశివారికి నూతన పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: ఈ రాశివారికి వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు చేస్తారు. సోదరులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: ఈ రాశివారికి సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తులు సమకూరతాయి.

Tags

Read MoreRead Less
Next Story